SDPT: చేర్యాల ఐదవ వార్డులో నెలకొన్న మురికినీటి సమస్యను పరిష్కరించాలని చేర్యాల రజక సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. మురుగునీటితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాలుగో వార్డులో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని, దోమలు, ఈగలతో సీజన వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు.