TG: దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తే ఊరుకోమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హెచ్చరించారు. జనాభా ప్రకారం సీట్లు పెంచితే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల పెంపు అంశంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఎలా పడితే అలా నియోజకవర్గాలను పెంచితే సహించమని తేల్చి చెప్పారు.