»Kerala Convention Centre Blast One Dead 20 Injured
Blast: కన్వెన్షన్ సెంటర్లో పేలుడు..ఒకరు మృతి, 20 మందికి గాయాలు
కేరళ కొచ్చిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Fire in the drug rehabilitation centre in iran 32 people died 16 people were injured
కేరళలోని ఎర్నాకులంలోని కలమస్సేరిలో క్రిస్టియన్ గ్రూపు కన్వెన్షన్ సెంటర్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ పేలుడు ఉదయం 9 గంటలకు జరిగిందని తమకు కాల్ వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
Shocking! A serial blast happened in Kochi, Kerala.
One woman kiIIed & more than 23 people are injured.
Reports suggest that there were some Jews present at this place & they were the prime target.
ఇక పేలుడు సంభవించిన క్రమంలో పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. పేలుడు తర్వాత కన్వెన్షన్ సెంటర్ వెలుపల చాలా మంది కనిపించారు. ఈ ఘటనపై కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ స్పందించారు. పేలుడు స్థలాన్ని పోలీసులు చుట్టుముట్టారని, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. మరోవైపు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కూడా స్పందించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.