»Aha New Planning Chiranjeevi And Ram Charan Mahesh Babu Movies Re Release
Aha: కొత్త ప్లానింగ్..చిరు, చరణ్, మహేష్ సినిమాలు రీ రిలీజ్!
అన్‌స్టాపబుల్ షోతో సరికొత్తగా బాలయ్యను హోస్ట్‌గా చూపించి..సక్సెస్ అయ్యాడు అల్లు అరవింద్. అలాగే ఆహా(aha)లో కొత్త కంటెంట్‌తో చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓటిటిలోను సినిమా రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
Aha new planning Chiranjeevi and ram Charan Mahesh babu movies re release
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలన్ని వరుస పెట్టి రీ రిలీజ్(re release) అవుతున్నాయి. భారీ వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే మెగాస్టార్ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా కూడా రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. మెగా ప్రొడక్షన్స్ ద్వారా నాగబాబు నవంబర్ 4న భారీ ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రీరిలీజ్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు థియేటర్లోనే హిట్ సినిమాలు రీ రిలీజ్ అవగా..ఇప్పుడు ఓటిటిలో కూడా కొన్ని సినిమాలు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా'(aha)లో బ్యాక్ టు బ్యాక్ ఈ మూడు సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ప్రింట్‌తో ఈ చిత్రాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘ఘారానా మొగుడు’, మహేష్ బాబు ‘అతడు’తో పాటు రామ్‌చరణ్ ‘మగధీర’ సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ముందుగా రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ నవంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ సినిమా నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి, కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన ‘ఘారానామొగుడు’ మూవీ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో.. ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు. ఏదేమైనా.. ఆహా ఓటిటి(OTT)కి ఈ సినిమాల రీ రిలీజ్లు బాగా కలిసిరానున్నాయనే చెప్పాలి.