AP: విజయవాడ నోవాటెల్లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, క్రియాశీలక సభ్యత్వంపై చర్చించనున్నారు. ఇప్పటికే 15 లక్షల సభ్యత్వాలు పూర్తి కాగా, ఈరోజుతో ముగియనున్న గడువును మరో 3 రోజులు పెంచే అవకాశం ఉంది. ఈ భేటీలో పార్టీ శ్రేణులకు పవన్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు.