MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.