AP: చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో జరిగిన ఈ సోదాల్లో రూ.95 వేల నగదును గుర్తించారు. అయితే, తనిఖీల సమయంలో ఒక బ్రోకర్ ఏసీబీ అధికారులపైనే దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. సదరు బ్రోకర్‌పై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.