NLG: చండూరు మండల పరిధిలోని కస్తాలలో ఉన్న సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 12:01 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని గ్రామస్తులు కోరారు.