డబుల్స్ లో గెలుపు సాధిస్తుందనుకున్న సానియా జోడి షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ నుంచి సానియా- అనా డానిలీనా జోడీ వెనుతిరిగింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఇండో-కజఖ్ జోడి చేతిలో ఓటమిపాలైంది. దీంతో సానియా జోడీకి స్లామ్ టైటిల్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయనే చెప్పొచ్చు. ఇకపోతే మిక్స్డ్ డబుల్స్ పైనే ఆశలు పెట్టుకుంది. అందులో కూడా సానియా జోడి టైటిల్ నెగ్గడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ లో సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది.