Karimnagar Collector And Police Commissioner Transfer
EC Transfer: కరీంనగర్ కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్, ఎస్పీ ఇద్దరు సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బదిలీ చేసిన వారిని తిరిగి మార్చేసింది. ఇప్పుడు ఓ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను ట్రాన్స్ ఫర్ చేసింది.