England vs Sri Lanka: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ రోజు శ్రీలంక, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్లు బెంగళూరు చినస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి నుంచి తడబడుతూనే ఆడింది. బెన్ స్టోక్ 73 బంతుల్లో 43 పరుగులు చేశాడు. జానీ బెయిర్‌స్టో 31 బంతుల్లో 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ జట్టులో ఏ ఒక్కరు కూడా అర్థ శతకం సాధించలేదు. మొత్తంగా 33.2 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది ఇంగ్లాండ్ జట్టు.
ఆట ఆరంభం నుంచే దూకుడుగా వ్యవహరించిన శ్రీలంక బౌలర్లు లహిరు కుమార 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశాడు. కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో శ్రీలంక టార్గెట్ 157 పరుగులకు చేరింది. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సునాయస విజయాన్ని సాధించింది. 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 25.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పెరెరా, కుశాల్ మెండిస్ త్వరగా ఔట్ కాగా.. నిస్సాంక 77 పరుగులతో, సమర విక్రమ 65 రన్స్ చేసి రాణించారు.