VZM: గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ లాభాలు పొందుతున్నట్లు బయటపడింది. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలపై లీగల్ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 7 చోట్ల తనిఖీలు చేపట్టగా.. 3 చోట్ల తక్కువ బరువు సిలిండర్లను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ డిప్యూటీ కంట్రోలర్ తెలిపారు.