TG: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలు.. నేరాల నిరోధక బిల్లు, ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లులకు ఆమోదం తెలిపింది. L&T నుంచి మెట్రో స్వాధీన ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తరఫున లావాదేవీల నిర్వహణ బాధ్యతను HMRLకు అప్పగించింది.