»Sudha Murthy Stories On Youtube Posted By Her Son
Sudha Murthy కథలు యూట్యూబ్‌లో పోస్ట్.. ఉచితంగానే స్ట్రీమింగ్
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటారు. తన కథలతో పిల్లలను ఆకట్టుకుంటారు. ఆమె చెప్పే కథలు పిల్లలకు తెలియాలని యూట్యూబ్‌లో కొత్తగా సిరీస్‌ను మొదలుపెట్టారు.
Sudha Murthy: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి విద్యావేత్త, రచయిత, మానవతా మూర్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చెప్పే మాటలు వినాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. కథలు చెప్పే విధానం పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది. చాలామంది పిల్లలు ఈమె పుస్తకాలను చదవడానికి ఇష్టపడతారు. ఆ కథలను స్పష్టంగా పిల్లలకు తెలియజేయడానికి సిద్ధం అవుతున్నారు. దానికి సంబంధించిన వివరాలను సుధామూర్తి కొడుకు రోహన్ మూర్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
పిల్లల పుస్తకాల రచయితలలో సుధా మూర్తి ఒకరు. గత కొన్ని సంవత్సరాల నుంచి పిల్లల కోసం వాళ్ల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఉత్తరాలు, ఇ-మెయిల్ ద్వారా వాళ్లకు కథలను అందించేవారు. ఇప్పుడు వాళ్ల కోసం యానిమేటెడ్ సిరీస్‌కి కథలను అందించడానికి అంగీకరించారు. అపర్ణ కృష్ణన్ స్టార్ట్ చేసిన ‘స్టోరీ టైమ్ విత్ సుధ అమ్మ’ అనే సిరీస్ అక్టోబర్ 31న యూట్యూబ్‌లో లాంచ్ అవుతుందని తెలిపారు.
ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళం మొత్తం ఆరు భాషల్లో అది రానుంది. ఈ సిరీస్ పిల్లలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఆమె కథలను వివరించే వేర్ స్టోరీస్ కమ్ టు లైఫ్ అనే ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ లింక్‌ను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో సుధా మూర్తి తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మీ కథలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. ఇలానే తెలియజేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.