KNR: హుజూరాబాద్ శివారులోని సిర్సపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. డంప్ యార్డు రద్దుకు బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు.