ASR: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొర్రా గుహలకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారని అరకు ఎంపీ తనూజారాణి తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బొర్రా రైల్వే స్టేషన్లో స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు సోమవారం ఢిల్లీలో భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే కటికి జలపాతం వద్ద రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు.