VZM: సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొని, సోషలిజం సాధనకు కృషి చేయాలని సీపీఎం నాయకుడు శంకరరావు పిలుపునిచ్చారు. కోట వద్ద, గాజులరేగలో సోమవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులఅర్పించారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయులని పేర్కొన్నారు.