CTR: పుంగనూరులోని బజారువీధిలోని శ్రీ కోదండ రాములవారి శ్రీరామనవమి మహోత్సవాలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు సోమవారం తెలిపారు. 27 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పలు పూజలు జరుగుతాయని చెప్పారు. ప్రతిరోజు రాములవారికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణ, ఉత్సవం జరుగుతుందన్నారు.