ఇంట్లో శాంతి, సానుకూల వాతావరణం ఉండాలంటే మన రోజువారీ అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేసే చిన్న తప్పులు ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతుంది. ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు, బూట్లు ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు. బయట నుంచి కోపం, టెన్షన్‌తో ఇంట్లోకి రావడం మంచిది కాదు. బయట నుంచి వచ్చాక చేతులు, కాళ్లు కడుక్కోవాలి.