VKB: తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ అధికారుల సోమవారం సీజ్ చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో కొన్నేళ్లుగా మొండి బకాయిలు ఉన్న యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో దుకాణాలకు తాళాలు వేశారు.