ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మద్దిరాల గంగమ్మ (60) అనే వృద్ధురాలు మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న ఘటనపై దర్యాప్తు చేపట్టారు.