NGKL: వంగూరు మండలం పోతిరెడ్డిపల్లి కి బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కల్వకుర్తి ఆర్టీసీ డిపో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో ఉన్న బస్సులను నిలిపివేయడం వల్ల పోతిరెడ్డిపల్లితో పాటు వివిధ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.