NTR: విజయవాడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మన ఊరు మన జెండా కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ చిగురుపాటి కుమార్ స్వామి అధ్యక్షత వహించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి దాసరి బాబి, జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.