»The Latest Poster From The Movie Game Changer Has Been Released The Movie Team Said That A Song From This Movie Will Be Released As A Diwali Gift
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా గేమ్ ఛేంజర్ పాట
‘ఆర్ఆర్ఆర్'(RRR)తో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్, చరణ్ దర్శకత్వంలో రానున్న 'గేమ్ ఛేంజర్'(Game changer) సినిమా నుంచి తాజాగా పోస్టర్ విడుదల చేసింది. ఈక్రమంలో ఈ సినిమా నుంచి ఓ పాటను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది.
Game Changer: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్'(Game changer). దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. కలర్ఫుల్గా ఉండే ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈక్రమంలో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని రామ్‌చరణ్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే దసరా కానుకగా గేమ్ ఛేంజర్ నుంచి పోస్టర్ విడుదల చేస్తూ.. దీపావళి కానుకగా ఈ ‘జరగండి’ అనే పాటను విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. రాజకీయ అంశాలతో ఉన్న యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో కనిపించనున్నారు.
సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను వేరే లెవల్‌కి తీసుకెళ్లిన స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాపైన భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ‘గేమ్ ఛేంజర్’ ఒక ఎత్తు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ ఎస్.ఎస్.తమన్(SS Thaman) అందించనున్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య(SJ Suryah), శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.