»Nara Bhuvaneshwari Who Visited Lord Tirumala Bus Yatra From Tomorrow
Nara Bhuvaneswari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. రేపటి నుంచి బస్సు యాత్ర
'నిజం గెలవాలి' అనే పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి బస్సు యాత్రను చేపట్టనున్నారు. బుధవారం ఆ యాత్ర చంద్రగిరి నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆవేదనతో ప్రాణాలు వదిలిన టీడీపీ కార్యకర్తలను, అభిమానుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) మంగళవారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు పలికారు. అలాగే టీటీడీ అధికారులు నారా భువనేశ్వరికి తీర్థ ప్రసాదాలను అందించారు.
నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)తో పాటుగా టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత నారావారిపల్లెకు భువనేశ్వరి చేరుకుని పెద్దల సమాధుల వల్ల పూజలు నిర్వహించారు. ఇకపోతే రేపటి నుంచి మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి బస్సు యాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే.
‘నిజం గెలవాలి’ అనే పేరుతో నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బుధవారం నుంచి మూడు రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ నేపథ్యంలో ఆవేదనతో ప్రాణాలు విడిచిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ప్రతి వారంలో మూడు రోజుల పాటు ఆమె ఈ యాత్రను చేపట్టనున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి ఆమె పరామర్శించనున్నారు. ఈ బస్సు యాత్ర బుధవారం చంద్రగిరి నుంచి ప్రారంభం కానుంది.