వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ (Hamoon) తీవ్ర తుపానుగా మారినట్టుగా భారత వాతావరణ శాఖ తెలిపింది.ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం బంగ్లాదేశ్(Bangladesh)లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ (AP) లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువా ఉంటుందని, మూడ్రోజుల పాటు వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ (Meteorology Dept) వెల్లడించింది.
మత్య్స కారులు సముంద్రంలో చేపలవేట(fishing)కు వెళ్లొద్దని హెచ్చరించింది. వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 25న తుఫాన్ బంగ్లాదేశ్‌లో తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేశారు.తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ తుపాను (Cyclone ) ఈశాన్యం దిశగా కదలడం ప్రారంభమైందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది.
ఒడిశా(Odisha)లోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదలేకపోతున్నాయి. దీంతో ఇవి బలపడటానికి వారం రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.