HYD: భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోండా డివిజన్ ఆదయ్య నగర్లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానం లాంటిదని అన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.