కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడి గడ్డ బ్యారేజీని ఆరుగురు సభ్యుల నేషనల్ డ్యామ్ సేప్టీ ఆథారిటీ నిపుణుల కమిటీ పరిశీలించనున్నాది.మేడిగడ్డ (Madigadda) (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై తాజాగా ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (Dam Safety Authority) ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని రంగంలోకి దింపింది. జలాశయాన్ని పరిశీలించి వెంటనే నివేదిక అందించాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో నిపుణుల కమిటీ హైదరాబాద్ (Hyderabad) కు బయలుదేరింది.
జలాశయన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమీటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది.కాగా ఎన్నికల వేళ మేడిగడ్డ ఘటన అధికార బీఆర్ఎస్ (BRS) కు ఛాలెంజ్ గా మారింది. ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఇరకాటంలో పెట్టేలా విమర్శలు గుప్పిస్తుండగా మరోవైపు కేంద్రం రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన (bridge) ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు సమాచారం. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర (Maharashtra) వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.