»Vigilance And Enforcement Inspections At Kaleswaram
Kaleswaram: కాళేశ్వరంపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ తనీఖీలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తనిఖీలు చేపట్టింది.
Vigilance and enforcement inspections at Kaleswaram
Kaleswaram: తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ ఒక మచ్చుతునక అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ప్రపంచంనే ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబితే, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆరోపణలు చేసింది. ఆ ప్రాజెక్ట్ కేసీఆర్కు ఏటీఎమ్ అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం విషయంలో అసలు విషయం తెల్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన చేశారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నేడు తనిఖీలు చేపట్టింది.
హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని జలసౌధ భవనంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీ, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫైళ్లను పరిశీలించారు. జయశంకర్ జిల్లాలోని మహాదేవ్ పూర్ ఇరిగేషన్ డివిజన్, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ కు చెందిన ఫైళ్లను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజినీరింగ్ బృందాలు పాల్గొన్నాయి.