PDPL: జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో లక్ష 77 వేల ఎకరాలలో వరి పంట సాగు చేసినట్లు తెలిపారు.