మేషం మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. బంధు ప్రీతి అధికంగా ఉంది. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనిలో సఫలీకృతమవుతారు. ఒక శుభవార్త వింటారు. ఈ రోజు మీరు గో సేవ చేస్తే ఫలితం దక్కుతుంది.
వృషభం ఈ రాశివారు కీలకమైన పనులను నేడు ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మొహమాటంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటిస్తే మేలు. ఈ రోజు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మీకు శుభం కలుగుతుంది.
మిథునం ఈ రాశివారికి నేడు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఎదురైన జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. నేడు గోసేవ చేస్తే సత్ఫలితాలు దక్కుతాయి.
కర్కాటకం ఈ రాశివారికి నేడు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. బంధువుల ఇళ్లలో భోజనం చేస్తారు. కీలకమైన విషయాల్లో మీకు మంచి జరుగుతుంది. మీరు నేడు మీ ఇష్టదైవ నామస్మరణ చేయాలి.
సింహం నేడు ఏ పని ప్రారంభించినా అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాల్లో మీకు ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మేలు జరుగుతుంది.
కన్య కీలకమైన విషయాల్లో పెద్దలు మీకు అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవనసర ఖర్చులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
తుల ఈ రాశివారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నేడు బంధువులతో వివాదానికి.. తగాదాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. దైవారాధన చేయాలి.
వృశ్చికం వీరికి నేడు శుభకాలం ఉంది. ధైర్యంతో అనుకున్న పనులు సాధిస్తారు. అర్ధ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదైవం శ్లోకాలు, ప్రార్ధనలు చేస్తే బాగుంటుంది.
ధనుస్సు ఈ రాశివారికి నేడు సత్ఫలితాలు దక్కుతాయి. ఒక శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు విజయవంతమవుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో పురోగతి సాధిస్తారు. ఈ రాశివారు నేడు ఆదిత్య హృదయం చదవాలి.
మకరం వీరికి మంచి ఘడియలు ఉన్నాయి. ముందుచూపుతో పనులను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సహాయం పొందడం మేలు జరుగుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
కుంభం మీరు పడ్డ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కీలకమైన వ్యవహారంలో ఇతరుల సహాయం లభిస్తుంది. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది.
మీనం ప్రారంభించిన పనుల్లో నేడు పురోగతి లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మబలాన్ని పెంపొందిస్తుంది. మీ ప్రతిభను ఇతరులు మెచ్చుకుంటారు. కొత్త వస్తువులను కొంటారు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే సత్ఫలితం లభిస్తుంది.