AP: రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేస్తామని ఎన్నికల్లో చెప్పామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ‘అభివృద్ధి చేసి చూపించాం. ఏ పని ప్రారంభించినా నాకు పూర్తిగా సహాకరిస్తున్న మిత్రుడు పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నాను. మరోవైపు యువనాయకుడు లోకేష్ కూడా బాగా కృషి చేశారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి’ అని పేర్కొన్నారు.