MBNR: జడ్చర్ల నియోజకవర్గం వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో జడ్చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఆస్తి పన్ను వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పురోగతిని తెలుసుకున్నారు.