SRD : బోల్లారం డివిజన్ పరిధిలోని బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన డీఎడ్ లెక్చరర్ల బృందం సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధిస్తున్న పద్ధతులను నేరుగా పరిశీలించారు. రాయడం చదవడం అంశాలను తెలుసుకున్నారు. విద్యాశాఖ ద్వారా అమలవుతున్న విద్యాసంస్కరణలపై సంతృప్తి వ్యక్తం చేశారు.