రణవీర్ సింగ్ ‘ధురంధర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ చిత్ర విజయంపై రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పటివరకు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ వద్ద సందడి చేయడంతో ఈ పుకార్లకు చెక్ పడింది.