KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని ఉమారాణి పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.