WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా ఒలింపిక్ విజేత జీవంజి దీప్తికి సోమవారం అసెంబ్లీలో గ్రూప్-2 ఉద్యోగం ఆమోదం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానికంగా ఆనందం వ్యక్తమైంది. 2024 పారా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన దీప్తి విజయాన్ని నాయకులు అభినందించారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.