TPT: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను స్వయంగా విని అర్జీలు స్వీకరించారు. మొత్తం 294 అర్జీలు అందగా, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని సూచించారు.