SDPT: గజ్వేల్ మున్సిపాలిటీలో జరిగే ప్రభుత్వ కార్య క్రమాల్లో తమకు భాగస్వామ్యం కల్పించడం లేదని ఛైర్ పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ ఛైర్మన్ పద్మాబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికార దాహంతో ప్రోటోకాల్‌ను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇవాళ ఆర్డీవో చంద్రకళకు వినతిపత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం తమను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించాలన్నారు.