BPT: కర్లపాలెం ప్రధాన వీధుల్లో డ్రైనేజీ లైన్లు మూసుకుపోవడంతో మురుగు నీరు బయటకు వచ్చి రోడ్లపై నిలిచింది. ఈ పరిస్థితిని గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఎంపీడీవో స్వయంగా ప్రాంతాలను పరిశీలించి, శుభ్రత పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లి పరిసరాలను శుభ్రపరిచారు.