»In Recent Times The Feel Good Movie Sapthasagaru Dathi Has Gained A Lot Of Craze Among The Youth The Film Crew Said That The Date Of Part B Has Been Fixed For This Chitham Which Is In Two Parts
ఈ మధ్య కాలంలో ఫీల్ గుడ్ మూవీగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'సప్తసాగరాలు దాటి'. రెండు పార్ట్‌లుగా ఉన్న ఈ సినిమా పార్ట్-బీ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Sapta Sagaralu Dhaati Side B: ప్రేక్షకులను భావోద్యేగానికి గురి చేసి ఆకట్టుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్-ఏ’. ‘777చార్లీ’ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. ప్రేమ కథా చిత్రం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి ఎక్కువగా యూత్ కనెక్ట్ అయ్యారు. సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. కన్నడలో వచ్చిన సినిమాను తెలుగులో ‘సినిమా సప్తసాగరాలు దాటి’ సైడ్-ఏ పేరుతో సెప్టెంబర్ 22న విడుదల చేసిన విషయం తెలిసిందే.
రెండు భాగాలుగా రూపొందించిన మూవీ తొలి పార్ట్ హిట్ అయ్యింది. దీంతో పార్ట్-బీ ఎప్పుడు విడుదల అవుతుందని కన్నడ ప్రేక్షకులతోపాటు తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సైడ్-బీ విడుదల గురించి చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బీ’ పేరుతో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబందం ప్రకటించింది. ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. సినిమాకు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా.. రక్షిత్ శెట్టి తన సొంత బ్యానర్‌పై నిర్మించారు. గుండు శెట్టి సహ రచయితగా వ్యవహరించారు.