»Rakshit Shetty Sapta Sagaralu Daati Side B How Is The Trailer
Sapta Sagaralu Daati: సప్తసాగారాలు దాటి..ట్రైలర్ ఎలా ఉందంటే?
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగారాలు దాటి సైడ్ బి ట్రైలర్ విడుదల అయింది. చేయని నేరానికి డబ్బు ఆశతో జైలు వెళ్లిన హీరో బయటకు వచ్చి ఏం చేశాడనేదే సైడ్ బి. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి మరి.
Rakshit Shetty Sapta Sagaralu Daati Side B.. How is the trailer?
Sapta Sagaralu Daati Side B: 777 చార్లీ సినిమాతో తెలుగులో పాపులర్ అయిన కన్నడ హీరో రక్షిత్ శెట్టి(Rakshit Shetty), రుక్మిణి వసంత్(Rukmini Vasant) కథానాయికగా నటించిన సప్తసాగారాలు దాటి పార్ట్ బి ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ప్రేమ కథాతో తెరకెక్కిన ఈ సినిమా సైడ్ బి (Sapta Sagaralu Daati Side B)కి యూత్ బాగా కనెక్ట్ అయింది. మొదటి భాగం అంతా జైలులో గడిపిన హీరో శిక్ష పూర్తి చేసుకుని విడుదల అయిన తరువాత ఏం జరుగుతుందనేది మిగితా కథ. ట్రైలర్లో చూపించిన విధంగా హీరోయిన్‌కు పెళ్లి అయిపోతుంది. విషయం తెలుసుకున్న హీరో బాధ పడుతాడు. కొత్త జీవితాన్ని మొదలు పెడుతాడు. కానీ తన జ్ఙాపకాలు గుర్తుకు వస్తాయి. తరువాత ఏం జరిగింది అనేది ట్రైలర్ చూస్తుంటే ఆసక్తిగా ఉంది. ఇక ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఫీల్ గుడ్ మూవీని హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించగా..రక్షిత్ శెట్టి తన సొంత బ్యానర్‌పై నిర్మించారు.