ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కొంతమంది అద్భుతంగా ఉ:ది అంటే, మరి కొందరు మాత్రం ఈ మూవీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తదుపరి ప్రభాస్ సినిమా సలార్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీ(Salaar Movie)కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై చాలా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ని ఎలా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా, ఈ నేపథ్యంలో ఓ తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా? ప్రముఖ శాండల్‌వుడ్ స్టార్ రక్షిత్ శెట్టి ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు ఊహాగానాలు పెరుగుతున్నాయి.
రక్షిత్ శెట్టి(Rakshit Shetty ) అతనే శ్రీమన్నారాయణ, 777 చార్లీ మొదలైన చిత్రాలతో హిట్ కొట్టాడు. ఈ క్రేజీ హీరో ఇప్పుడ సలార్ లో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రక్షిత్ శెట్టి పాత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్(Shruthi hassan) కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు కాగా, భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. మరో పది రోజుల్లో పవర్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.