»Breaking Tragedy In The Film Industry Famous Director Passed Away
Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ దర్శకుడు మృతి
ప్రముఖ దర్శకుడు బైజు పరవూర్ మృతిచెందారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన మరణించినట్లు కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. బైజు పరవూర్ మృతితో కేరళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
సినిమా ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు(Tragedies) చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు బైజు పరవూర్(Director Byju Paravoor) మృతిచెందారు. మూడు రోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కేరళ(Kerala)లోని కొచ్చి సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. బైజు పరవూర్..ఫుడ్ పాయిజన్ వల్లనే చనిపోయి ఉంటారని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు.
కోజికోడ్‌లోని ఓ హోటల్లో బైజు పరవూర్(Director Byju Paravoor) శనివారం భోజనం చేశారు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి వద్ద ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబీకులు ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆయన్ని పరీక్షించి మెడికేషన్ ఇచ్చారు. అయితే ఆదివారం ఉదయం ఆయన పరిస్థితి విషమించింది.
తీవ్ర అస్వస్థతకు గురైన బైజు పరవూర్(Director Byju Paravoor) కోజికోడ్ నుంచి కొచ్చి ఆస్పత్రికి తరలించారు. కొచ్చిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బైజు మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ఫుడ్ పాయిజన్ వల్లే బైజు పరవూర్ మృతిచెందడానికి కారణమని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. కేరళ ఇండస్ట్రీలో బైజు ఇప్పటి వరకూ 45 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మరణంతో కేరళ సినీ ప్రముఖులు(Cine Celebrities) విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.