దేశం రాజకీయ నినాదాల కంటే రాజ్యాంగ విలువలకు పెద్ద పీట వేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వ్యాఖ్యానించారు. బెంగళూరులో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ.. UAPA అరెస్టుల్లో తక్కువగా శిక్షలు పడటాన్ని ఉద్దేశించి, ఇవి వికసిత్ భారత్ నమూనా కాదని పేర్కొన్నారు. 2027 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చర్చలు, అసమ్మతికి చోటు ఉండాలని సూచించారు.