SRCL: వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు.