»Priyanka Gandhi Said At Mulugu We Will Give Benefits To The Unemployed And Help Poor Women
Priyanka Gandhi: నిరుద్యోగులకు భృతి ఇస్తాం, పేద మహిళలకు సాయం చేస్తాం
తెలంగాణలోని ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో రోడ్‌షో జరిగింది. చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ మేరకు ప్రారంభించారు. మరోవైపు ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Priyanka Gandhi said at mulugu We will give benefits to the unemployed and help poor women
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(priyankagandhi)బుధవారం తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల కార్డుకు ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత కొనసాగిన యాత్ర ములుగు వరకు చేరగా..అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.
A girl committed suicide because she couldn’t get a job. BRS leaders questioned her integrity and said that she didn’t apply for any exam which was false.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. అంతేకాదు ఇటివల ఓ యువతి కూడా జాబ్స్ విషయంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో BRS నాయకుల చిత్తశుద్ధి ఎక్కడ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు నిరుద్యోగులకు భృతి ఇచ్చి యువతను ఆదుకుంటామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతోపాటు పేద మహిళలకు రూ.2500 సాయం చేస్తామన్నారు. వరి పంటకు రూ.2500, మొక్కజొన్నకు రూ.2200 మద్ధతు ధర ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయని ఆరోపించారు. ఈ క్రమంలో ల్యాండ్, సాండ్ మాఫీయాతో దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి క్రమంలో మీ ఆశలు నెరవేరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రియాంక గాంధీ ఆకాంక్షించారు.