»Rahul Gandhi And Priyanka Gandhi Started Congress Vijayabheri Bus Yatra At Mulugu Ramappa Temple
CongressVijayabheriYatra: ప్రారంభించిన రాహుల్, ప్రియాంక
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ వియజభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.
తెలంగాణలో పోలింగ్‌కు కొన్ని రోజులే మిగిలి ఉన్నందున కాంగ్రెస్ నేతలు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను నేడు రాష్ట్రానికి రప్పించారు. ఈ క్రమంలో ములుగులోని రామప్ప దేవాలయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఇరువురు కలిసి చారిత్రాత్మక ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ జెండా ఊపి విజయభేరి బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర రామప్ప నుంచి ములుగు వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ములుగు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ప్రధానంగా స్థానిక సమస్యలు నిరుద్యోగం, TSPSC ప్రశ్నపత్రం లీక్‌లు, పరీక్షల రద్దు, అవినీతి, పోడు భూముల అంశాలు, ధరణి భూ సమస్యలు, రైతు ఆత్మహత్యలు, కాంగ్రెస్ ఆరు హామీల వంటి అనేక అంశాలను ప్రస్తావించనున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరనున్నారు.
అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో ములుగు, పెద్దపల్లి, ఆర్మూరులో జరిగే మూడు బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగించనున్నారు. బస్సుయాత్రలో భాగంగా అక్టోబర్ 18న భూపాలపల్లిలో నిరుద్యోగ యువకులతో కలిసి నిర్వహించనున్న పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 19న రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగుల సంఘాలతో సమావేశమై..రెగ్యులరైజ్ కాని కాంట్రాక్టు ఉద్యోగులతో కూడా సమావేశం కానున్నారు. అక్టోబరు 20న బీఆర్ఎస్ హయాంలో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాహుల్ గాంధీ సందర్శిస్తారు. ‘అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ తొమ్మిదేళ్లు గడిచినా ఎలా విఫలమైందో ఎత్తిచూపనున్నారు.