VSP: గీత కులస్తులకు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. జనవరి 4న ముడసర్లోవ పార్కులో జరిగే వన సమారాధనకు గీత కులాల ఐక్య వేదిక సభ్యులు ఆయనను ఆహ్వానించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.