పోలీసుల్లో ఏమాత్రం చలనం లేదని. విరక్తి చెందిన బాధిత మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్కు తాళం వేసి నిరసన తెలిపింది’. ఈ షాకింగ్ ఘటన విశాఖ జిల్లా (Visakha District) పెందుర్తిలో రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని పెందుర్తి (Pendurthi) శ్రీకృష్ణరాయపురంలో తెరపల్లి గౌతమి పార్వతి అనే మహిళ ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటోంది. భర్తతో విడిపోయిన గౌతమి.. కొడుకు, కూతురుతో కలిసి ఆరేళ్లుగా అదే అపార్ట్ మెంట్ (Apartment) లో ఉంటోంది. అయితే, ఈ అపార్ట్ మెంట్ ను అమ్మేస్తానని, ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ బి.పీర్లు చెప్పారు.
దీంతో అపార్ట్ మెంట్ ను తానే కొనుగోలు చేస్తానని చెప్పిన గౌతమి.. పీర్లుతో రూ.12.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది.అడ్వాన్స్ గా రూ.5 లక్షలు కూడా ఇచ్చినట్లు తెలిపింది. కొంతకాలంగా ఇల్లు ఖాళీ చేయాలంటూ పీర్లు వేధింపులకు గురిచేస్తున్నాడని, అడ్వాన్స్(Advance) గా ఇచ్చిన మొత్తం తిరిగిస్తే ఖాళీ చేస్తానని చెప్పినా వినిపించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. ఇటీవల తాను లేని సమయంలో ఇంటికి వచ్చి సామాన్లు అన్నీ బయటపడేశారని, ఫ్లాట్ కు తాళం వేసుకుని వెళ్లాడని చెప్పింది.
దీంతో మరోదారిలేక పిల్లలతో కలిసి వరండాలోనే ఉంటున్నానని వివరించింది. దీనిపై ఫిర్యాదు (Complaint) చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తన బాధ పోలీసులకూ అర్థం కావాలనే ఉద్దేశంతో పోలీసుస్టేషన్ (Police Station) కు రాత్రి తాళం వేసినట్లు తెలిపింది. అయితే పోలీసులు తక్షణమే స్పందించి మహిళ దగ్గర తాళం చెవి తీసుకుని పోలీస్ స్టేషన్ తాళం తీశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని లేకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని బాధితురాలు ఎస్.గౌతమి పోలీసులను హెచ్చరించింది.